Posts Tagged ‘కొత్తపాళీ’
ఆదిభిక్షువు వాడినేది కోరేది
Thursday, October 2, 2008 0:53 22 Commentsఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన మొదటి సినిమాలోదీ పాట. బాగు ప్రాచుర్యం పొందిన పాట. పండితులసంగతి తెలియదు గానీ, నాబోటి పామరులకు బాగా నచ్చిన పాట. నిందాస్తుతి శిల్పంలో వ్రాయబడ్డ పాట. నిందాస్తుతి అన్నది ఎప్పటినుంచో ఉన్న సాహితీప్రక్రియే. సినిమాపాటల్లో కూడా నిందాస్తుతితో ఉన్న కొన్ని పాటలున్నట్టే గుర్తు. ఇంతకీ సినిమాలో ఈ పాటలో మూడు చరణాలుంటాయి. కానీ, అసలు ఆయన వ్రాసినదానిలో ఇంకా చాలా చరణాలున్నాయి. అన్నిటినీ మీముందుంచాలని ఈ ప్రయత్నం.
తేనెలొలికేటి పూలబాలలకు [...]
అలై పొంగెరా …మానసము…
Wednesday, August 27, 2008 9:31 13 Commentsఅలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
అసలు ఈ పాటని నేను పూర్తిగా వినడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలై పొంగెరా – మలైపొంగెరా అని వినగానే వేటూరి మరో రుబ్బురోలు పాట అని వదిలేసాను. అలాంటిది మాస్టారు ఈ పాటని వివరించినటపా చూసేసరికి సంభ్రమం కలిగింది. పాట వింటూ వింటూ జగణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంతలోనే నెత్తిమీద బాంబు పేలింది. పాటని వివరించమంటూ కొత్తపాళీగారి ఆజ్ఞ. అందరూ పాటని పూర్తిగా పరిశోధించినతరువాత వ్రాయడంలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే [...]