వినయం
Friday, September 5, 2008 17:46కవితలు విభాగంలో ప్రచురించబడినది.
ఇసుకలో పొర్లుతున్న ఓ చిన్నిఉడత
పర్వతాల్ని కదిలిస్తున్న వానరసేనను చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
రామహస్తం వెన్ను నిమిరింది.మేఘం నుంచి రాలిపడుతున్న ఓ వర్షపు చుక్క
అగాధమైన సముద్రాన్ని చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
ముత్యపు చిప్ప తనలో ఇముడ్చుకుంది
అడవిలో పెరుగుతున్న వెదురు
నీడనిచ్చే మర్రిచెట్టును చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
బృందావిహారి తన పెదవిపైనుంచాడుమస్తిష్కంలో ఉదయిస్తున్న సహనం
ఎగసిపడుతున్న వాదాన్ని చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
సత్యం తన ఎదకు హత్తుకుంది.
ఈ టపాపై వ్యాఖ్యలను మీరు RSS 2.0 ఫీడు ద్వారా చదువవచ్చు.
మీరు వ్యాఖ్యానించవచ్చు, లేదా మీ సైటు నుంచి ట్రాకుబేకు చేయవచ్చు.
వికటకవి
September 5th, 2008 7:25 pm కు
వ్వావ్. చాలా అద్భుతంగా ఉందండీ. ఇటీవలి కాలంలో చదివిన మంచి కవిత ఇది.
అని అన్నారుPurnima
September 5th, 2008 10:13 pm కు
వికటకవి గారి మాటే నాదీనూ.. వావ్!
కానీ ఒక చిన్ని సందేహం, శీర్షిక “వినయం” అని ఎందుకు పెట్టారు? నేనయితే విలువ అని పెట్టేదాన్ని ఏమో!కుతూహలం కొద్దీ అడగటం అంతే, అన్యధా భావించవద్దని మనవి.
కొద్ది రోజులుగా నాలో జరుగుతున్న మానసిక సంఘర్షణ మీ కవిత ద్వారా ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.
అని అన్నారుithink
September 5th, 2008 10:19 pm కు
Boy, Everybody is being a killer these days in poetry. A very good one.
అని అన్నారుఅనానిమకుడు
September 6th, 2008 1:00 am కు
కస బిస కస బిస..బాగున్నట్టనిపిస్తూనే సుత్తి గా ఉంది కవిత..కిచ కిచ.. బలవంతంగా రాసినట్లు లేదూ.. అయినా నా మాటలు పాటి చెయ్యవులే.. go ahead.
అని అన్నారుbollojubaba
September 6th, 2008 1:07 am కు
చాలా బాగుంది. మీ కవిత.
అద్బుతమైన ఇమేజెస్ ఉన్నాయి.
జీవితంలో ఒక్కొక్క సారి చెలరేగే కల్లోలాలకు
మాంచి సమాధానాలున్నాయి
మనసులో ఒక్కొక్క సారి ముసురుకొనే చీకట్లను తొలగించే
మాంచి వెలుగు దారులున్నాయి ఈ కవితలో
చాలా బాగుంది.
పూర్ణిమ గారన్నట్లు
నాలోని కొన్ని ప్రశ్నలకు స్వాంతననిస్తోంది మీ కవిత
ధన్యవాదాలు
బొల్లోజు బాబా
అని అన్నారుsujji
September 6th, 2008 1:59 am కు
kavitha chaala baagundi…
అని అన్నారుvamsi
September 6th, 2008 2:40 am కు
mI kavita coosi….
naalOni bhAvAlaku rujuvaina naa basha siggupadindi…
nA astitvAniki arthamEmiTani…
naa basha kooda stanam vundi…
comment roopamlo anTu….
mee blog prachurinchindi ii vidhamgaa…
—Vamsi
అని అన్నారుకొత్తపాళీ
September 6th, 2008 7:57 am కు
ముందుటి నాలుగు చరణాలూ చాలా బావున్నాయి. పోలికల్లోనూ, పదాల వాడుకలోనూ.
అని అన్నారుచివరి చరణంలో ఆ పోలిక అతకలేదు. మెసేజి ఇవ్వడానికి కథ రాసినట్టో సినిమా తీసినట్టో అయింది చివరికి.
teresa
September 6th, 2008 8:11 am కు
భలే బాగుంది. తేలికపాటి పదాలతో చిక్కని భావం!
అని అన్నారుChivukula Krishnamohan
September 6th, 2008 8:30 pm కు
వికటకవి,ఐథింక్,సుజ్జి,teresa – ధన్యవాదాలు.
అని అన్నారుపూర్ణిమ – వాటికి ఆ విలువను ఆపాదించిన మూలాన్ని శీర్షిక చేసాను. ధన్యవాదాలు.
బొల్లోజుబాబా- ధన్యవాదాలు. అందులో నాదేమీ లేదు.యధ్బావం తద్భవతి. చెయ్ – జగము మరచి జీవితమే సాధన – నీ మదిని తరచి చూడడమే శోధన – నీదొక ఆగని ప్రయాణం – ప్రగతికే అది చేతనం.
వంశీ – చిక్కనైన భావాలు పలికిస్తున్నారు – లేఖిని వాడండి – ఇలాంటి పెద్ద వ్యాఖ్యలు ఇంగ్లీషు తెలుగులో చదవడం కష్టం – మిగతా వ్యాఖ్యాతలు మీ వ్యాఖ్య చదవాలంటే తెలుగులోనో, ఇంగ్లీషులోనో ఉంటే మంచిది కదా! వేరేగా అనుకోకండి.
కొత్తపాళీ – సత్యం జీవితపరమార్ధం అనుకుంటే, వాదం మనలోని నమ్మకరాహిత్యాన్ని సూచిస్తే, సహనం నమ్మకాన్ని సూచిస్తున్నాది ( నేను నిలబడ్డ జాగానుంచి) కాబట్టి ఇది నా అంతఃమధనమే – ఎవరికీ ఏమీ బోధించడానికి కాదు – అయినా ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు గానీ, నేను ఎవరికీ ఏమీ బోధించగలనని నేను అనుకోవట్లేదు. ఇంతకీ నేను వ్రాసిందే నాలుగు చరణాలు – మీరు మొదటి నాలుగూ బావున్నాయి అన్నారు – అంటే
అనానిమస్సు గారూ – మెయిలు అడ్రస్ తప్పు ఇచ్చి మరీ ఇలా ఒక్క ముక్క అనేసి వెళ్ళిపోతే ఎలా? నాకా మీ భాషని డీకోడ్ చెయ్యటం రావట్లేదు. మీదగ్గరనుంచి నేర్చుకోవాలనుంది. ఎలా? గో ఎహెడ్ అంటే – మరి మీరు మార్గదర్శనం చేయాలి కదా -
నాగమురళి
September 11th, 2008 8:05 am కు
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా బాగుందండీ కవిత.
అని అన్నారుsantosh , UOH
November 16th, 2008 7:09 pm కు
excellent, inspirational poetry.. continue it
అని అన్నారుBALAKRISHNA
February 22nd, 2010 12:07 am కు
no talks its very super
అని అన్నారు