నేను సైతం…

Monday, April 13, 2009 9:49
కథలు విభాగంలో ప్రచురించబడినది.

స్వామీ! స్వామీ! అంటూ గురువుగారిని పిలిచాడు శిష్యుడు.

నెమ్మదిగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచిన గురువు శిష్యునివంక ఏమిటన్నట్టు చూసాడు.

మీరు ప్రపంచం బాగోగులగురించి అంతగా పట్టించుకుంటారు. కొంచెం శిష్యులగురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది.

ఏమి నాయనా! నీకేమి కష్టం వచ్చింది?

నేను ధరించిన ధోవతీ చూడండి గురువర్యా! పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. నాకొక కొత్త ధోవతీని ఇప్పిస్తే…

గురువు శిష్యుడి ధోవతీ వంక తేరిపార చూసాడు. నిజంగానే జీర్ణావస్థలో ఉందది.

సరే అంటూ… గురువు శిష్యునికి ఒక కొత్త ధోవతీ తెప్పించాడు. శిష్యుడు ఆనందంగా కొత్త ధోవతీ తీసుకుని వెళ్ళిపోయాడు. కొంచెం సేపు గడిచాక,
గురువు తన పాఠం శిష్యులకు ఎంతగా వంటపట్టిందో చూద్దామంటూ, శిష్యుని గదికి వచ్చాడు.

నాయనా! ఇప్పుడు అంతా సౌఖ్యమేనా?

ఓ.. ఈ కొత్త ధోవతీ చాల సుఖంగా ఉందండీ.

ఇంకేమైనా కావాలా?

లేదండీ… మరేమీ అవసరం లేదు.

కొత్త ధోవతీ వచ్చిందిగా… పాత ధోవతీని ఏమి చేసావు?

దానిని దుప్పటిగా వాడుతున్నాను గురువర్యా!

ఓహో.. అయితే మరి పాత దుప్పటిని ఏమి చేసావు?

దానిని కిటికీ కర్టెన్ గా వాడుతున్నాను.

మరైతే పాత కిటికీ కర్టెన్ పారేసావనుకుంటాను?

లేదండీ! దానిని వంటింటిలో గిన్నెలు తుడవడానికి వినియోగిస్తున్నాము.

అయితే గిన్నెలు తుడిచే గుడ్డ?

దానిని ఇప్పుడు నేల తుడవడానికి ఉపయోగిస్తున్నాము.

అయితే నేలను తుడిచే గుడ్డ?

చెప్పు నాయనా!

దానిని ఎలా వినియోగించాలో తెలియలేదు. బాగా చివికిపోయిఉంది. అంచేత… సాయంత్రం భోజన సమయంలో వెలిగించే దీపాలకి వత్తిగా వినియోగిస్తున్నాము.

సంతృప్తిగా గురువు వెనుదిరిగాడు.

ఎప్పుడో చదివిన ఒక కథ ఆధారంగా…

మనకున్న వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించడం మన బాధ్యత. ఈ నేల మనకి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. మనం మన తరవాత తరాలకి తీర్చాల్సిన అప్పు. వనరుల వ్యర్థపరచడాన్ని ప్రతీ స్థాయిలో అరికట్టాలి.

మీరు వ్యాఖ్యానించవచ్చు, లేదా మీ సైటు నుంచి ట్రాకుబేకు చేయవచ్చు.

“నేను సైతం…” కు 7 వ్యాఖ్యలు

  1. అసంఖ్య

    April 13th, 2009 1:48 pm కు

    నిజమే.

    “అయితే నేలను తుడిచే గుడ్డ?

    చెప్పు నాయనా!”

    ఈ “విరామం” కధకే హైలైట్ ;)

    అని అన్నారు
  2. వనరుల వినియోగాన్ని అరటిపండు వొలిచినట్టుగా లెస్సగా చెప్పారు,అందుకోండి అభినందనలు

    April 14th, 2009 1:43 am కు

    వనరుల వినియోగాన్ని అరటిపండు వొలిచినట్టుగా లెస్సగా చెప్పారు,అందుకోండి అభినందనలు

    అని అన్నారు
  3. కొత్తపాళీ

    April 15th, 2009 4:48 pm కు

    సెబాసు

    అని అన్నారు
  4. కొత్తపాళీ

    April 20th, 2009 7:35 am కు

    మీరు ఏదన్నా పాటకి విశ్లేషణ రాసి చాలా రోజులు కాదు మాసాలైంది. ఏదన్నా మంచి పాట ఎంచుకుని రాయకూడదూ? అసలే వసంత ఋతువు గదా? :)

    అని అన్నారు
  5. మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్.

    May 29th, 2009 4:48 pm కు

    మంచి టపా రాసారండి

    అని అన్నారు
  6. Eddy

    June 10th, 2009 12:40 pm కు

    ‘Nenu Saitham’ chadivenu… chala kashtabadi!! nachchindi… Makes a lot os sense in today’s world… but how many people apply these thoughts today?

    అని అన్నారు
  7. Eddy

    June 10th, 2009 12:41 pm కు

    ‘Nenu Saitham’ chadivenu… chala kashtabadi!! nachchindi… Makes a lot of sense in today’s world… but how many people do apply these thoughts today?

    అని అన్నారు

వ్యాఖ్యానించండి