Archive for December, 2008
స్వరరాగగంగాప్రవాహమే…
Sunday, December 14, 2008 0:21 12 Commentsఉత్సుకత – ఉత్కంఠ – ఉద్వేగం. అన్నీ కలగలిపిన అదో విచిత్రమైన అనుభూతి. కొన్ని క్షణాలలో నేనింక ఆనందపు అవధులను దాటి ఆకాసపు ఆ కొస అందుకోబోతున్నానని. కాలం గడవటం లేదు. ఎలా ఉంటుంది ఆ అనుభూతి. నిజంగా నన్ను నేను కోల్పోతానా – అనాది జీవన వేదంతో కంపిస్తానా ఎద కనుమలలో విరించి విపంచి గానం వినిపిస్తుందా – ఆలోచనలు ఎడతెగటం లేదు.
నాకు కర్నాటకశాస్త్రీయ సంగీతమంటేనే పరిచయం లేదు. అప్పుడప్పుడూ విన్న బాలమురళి పంచరత్నాలూ, రామదాసు [...]