Archive for November, 2008
హిందూ తాత – సెక్యులర్ మనవడు – 4
Sunday, November 16, 2008 15:56 11 Commentsమనవడు: తాతా, ఈ భీష్ముడి సంగతి కొంచెం తేలుస్తావా?
తాత: శత్రువులకు మరణ రహస్యం చెప్పాడని, అది దేశ ద్రోహం అని భీష్ముడి మీద ఒక అభియోగం. దీని పూర్వాపరాలు కొంచెం చూద్దాం.
అప్పటికి 9 రోజుల యుద్ధం ముగిసింది. ఇరుపక్షాలవైపూ విపరీతమైన సైన్య నష్టం జరిగింది. పాండవుల్లో ఒక నిరాశ అలముకుంది. భీష్ముడు ఆయుధం ధరించి ఉండగా విజయం చేజిక్కే మార్గం అసంభవం అని వాళ్ళకు స్పష్టం అయ్యింది.
ఉన్నాడుగా నల్లనయ్య. వెళ్ళి మీ తాతకు అతనిచ్చిన ఆశీర్వాదం [...]
చీమ నేర్పిన పాఠం
Thursday, November 13, 2008 8:47 4 Commentsనిన్న సాయంత్రం చెప్పుల్లేకుండా గడ్డిలో నడుస్తుంటే కసక్కుమని రాయి గుచ్చుకుంది. ఈ రాయి చేసిన పాపానికి నిష్కృతి లేదు. దీనికి రౌరవాది నరకాలు తప్పవని అనుకుంటూ కిందకి చూసాను. అదే రాయిపై ఒక చీమ హాయిగా పాకురుకుంటూ ఆనందముగా వెళ్ళిపోతోంది. ‘ ఆహా! ఏమి ఈ చీమ చేసిన పుణ్యము – నేను చేసిన పాపమేమి’ అని అనుకుంటూ ఉండగా చేదుగా ఉన్నా ఒక నిజం స్ఫురించింది. నాకు నొప్పి కలిగించింది నా బరువేగాని రాయి [...]