Archive for October, 2008
నాకూ ఛందపుటీగ కుట్టింది.
Friday, October 24, 2008 19:46 6 Commentsమొన్న భువనవిజయం చూసానా – అప్పటినుంచి ఎలాగోఅలాగ, ఏదో ఒక విషయం మీద ఛందస్సుతో పద్యం రాసేయాలని. ఆశ ఆకాశమంత. శక్తి అణువంత. కానీ ఊహతో పోరాడి తర్కం/నిజం ఎప్పుడు గెలిచింది కనుక? ఎలాగోలా పద్యాలు వ్రాసేద్దామనే నిశ్చయించాను. అనుకుంటే సరిపోతుందా? మనకసలు ఏవీ రాదాయె. చిన్నప్పుడు చదువుకున్న ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు’ లాంటివి తక్క – గట్టిగా లెక్కెడితే వందపద్యాలు కూడా రావు. యమాతారాజభానస అని ఏదో సినిమాలో కమల్ హాసన్ అనడంతో గణాలని గుర్తుపెట్టుకునీ – [...]
ప్రయత్నం
Friday, October 10, 2008 14:35 7 Commentsఇంకేమి చెయ్యాలో నాకు తెలియటం లేదు.
ఈ రాయికి సంగీతం నేర్పించాలంటే ఇంకేమి చెయ్యాలో..
ముందుగా నీలపు నింగిని చూపించా – ఆ మౌనగీతాన్ని వినమని
గాలి వేగాన్ని – అందులోని భావగీతాన్నీ వినిపించా
వర్షమేఘాల హర్షరాగాన్ని వినిపించా – వాద్యమయ్యే ఆ ఘోషనీ వినిపించా
నేలను తాకిన నీరు జలపాతంగా ఎదిగే హోరుని వినిపించా
అల్లరి జలపాత కన్నియ పారే ప్రౌఢనదిగా మారిన మంద్రాన్ని వినిపించా
నది మందగమనంతో పుడమి తల్లిని కలసి చెప్పిన ఊసులను వినిపించా
పైరుపైటేసి పుడమితల్లి పాడిన సంక్రాంతి పదగతులను వినిపించా
నది తన [...]
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
Wednesday, October 8, 2008 0:25 9 Commentsఅర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?
చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం [...]
ఆదిభిక్షువు వాడినేది కోరేది
Thursday, October 2, 2008 0:53 22 Commentsఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన మొదటి సినిమాలోదీ పాట. బాగు ప్రాచుర్యం పొందిన పాట. పండితులసంగతి తెలియదు గానీ, నాబోటి పామరులకు బాగా నచ్చిన పాట. నిందాస్తుతి శిల్పంలో వ్రాయబడ్డ పాట. నిందాస్తుతి అన్నది ఎప్పటినుంచో ఉన్న సాహితీప్రక్రియే. సినిమాపాటల్లో కూడా నిందాస్తుతితో ఉన్న కొన్ని పాటలున్నట్టే గుర్తు. ఇంతకీ సినిమాలో ఈ పాటలో మూడు చరణాలుంటాయి. కానీ, అసలు ఆయన వ్రాసినదానిలో ఇంకా చాలా చరణాలున్నాయి. అన్నిటినీ మీముందుంచాలని ఈ ప్రయత్నం.
తేనెలొలికేటి పూలబాలలకు [...]