Archive for September, 2008

ప్రేమంటే ఏమిటంటే … ప్రేమించగానె నాకు తెలిసె…2

Friday, September 26, 2008 22:16 16 Comments

కిందటి టపాలో ప్రేమ, దైవం, సత్యం అన్నవి అదే వరుసలో దుర్వినియోగం చెయ్యబడ్డ పదాలుగా చెప్పాను కదా! ముందుగా అవి అదే వరుసలో ఎందుకు దుర్వినియోగం చెయ్యబడ్డాయి అన్నది చూద్దాం.
సత్యం అతి తక్కువగా దుర్వినియోగపరచబడడానికి కారణం ఏమిటంటే దాని అనుభూతి పొందడం చాలా కష్టం. నిజంగా సత్యాన్ని కనుగొన్నవారిని వదిలేయండి. సత్యం తను కనిపించేముందు ఆ వ్యక్తినోటిని కుట్టేసి ఆ తరువాత కనిపిస్తుందిట. కాబట్టి మీకు నిజంగా ఎవరైనా సత్యాన్ని కనుగొన్నామని చెపితే వారు అబద్ధం చెబుతున్నట్టే. [...]

This was posted under category: అవీ ఇవీ Tags: , ,

అగ్ని ప్రవేశం

Saturday, September 20, 2008 11:50 29 Comments

పల్లకీ సాగుతోంది. ఉద్విగ్నతతో, ఆనందంతో, అయోమయంలో, నిజమా కలా అని తెలియని పరిస్థితిలో డోలాయమానంగా ఉంది సీత. కొంచెంసేపటి క్రితం త్రిజట “అమ్మా! రావణుడు మరణించాడు. నీ కష్టాలు గట్టెక్కాయమ్మా! శ్రీరామచంద్రుడు నిన్ను తక్షణమే చూడాలంటున్నారు. పదమ్మా! ” అన్నది. అలంకరించుకొమ్మంటూ చీనీ, చీనాంబరాలు, నగలూ అన్నిటితో స్త్రీలు నిలబడి ఉన్నారు. నా రాముని నేను చేరుకోవాలి – నాకివన్నీ ఎందుకు అంటూ సీత వడివడిగా బయలుదేరింది. పల్లకిని అధిరోహించమ్మా అని త్రిజట అంటూ సీతను పల్లకీ [...]

This was posted under category: అవీ ఇవీ Tags: , , , ,

ప్రేమంటే ఏమిటంటే … ప్రేమించగానె నాకు తెలిసె…

Thursday, September 18, 2008 11:30 5 Comments

ప్రేమ – బహుశా అతి ఎక్కువగా తప్పు సందర్భంలో వాడే పదం అని అనిపిస్తుంది. కొన్ని పదాలు చేసుకున్న దురదృష్టమేమో అనిపిస్తుంది. దేముడు, సత్యం, ప్రేమ, ఆనందం ఇలాంటి పదాలు ఏమి పాపం చేసుకున్నాయో కదా… అసలు ఆ పదం ఎందుకు ఉన్నాదో తెలియదు గానీ, దానిని ఖండఖండాలు చేసి, చీల్చి చెండాడి, చివరికి ఆ పదం అసలు అర్ధాన్ని తప్ప మిగతా అన్నిటినీ సూచిస్తుంది అన్నంత హింసించకపోతే మనకి నిద్ర పట్టదు.
ఉదాహరణకి దేముడు అన్న పదం [...]

This was posted under category: అవీ ఇవీ

హిందూ తాత – సెక్యులర్ మనవడు – 3

Friday, September 12, 2008 20:51 7 Comments

“తాతా! ఇన్ని మతాలేంటి? ఇన్ని విధానాలేమిటి? నిజంగా దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలేమిటి? ఇవన్నీ ఒక తానులో ముక్కలే అనిపిస్తాయి. అసలు మతాన్నే నిషేధిస్తే మంచిదనిపిస్తుంది. వీటన్నిటిలో ఉన్న గందరగోళం కంటా హేతువాదం/తర్కం మేలనిపిస్తుంది. అది కనీసం ఈ తానులో ముక్క కాదు కదా! “

This was posted under category: తాత - మనవడు

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కథ – 2

Tuesday, September 9, 2008 1:00 5 Comments

సినిమాల్లోలాగ చెట్లు ఊగడం, కెరటాలు పెద్దగా రావడం, పక్షుల అరుపులూ అలా ఏదో ప్రళయం వచ్చినట్టుగా అయ్యిందని అనేసుకున్నారా? ఏమీ లేదు. నిజంగా ప్రళయం చెప్పి రాదు.

ధన్యోస్మి అంటూ ఆమని బ్రహ్మకూ, లక్ష్మికీ, సరస్వతికీ నమస్కరించి వెనుతిరగబోతూ ఒక్కసారి నారదుడి వంక చూసింది. ఆశ్చర్యం. నారదుడి ఫాలబాగంలో – చమత్కారి, పరమభక్తుడు, కొంటెవాడు, వాక్చాతుర్యం కలవాడు అని కనిపించింది. నుదుటి మీద తెర ప్రత్యక్షం కాగానే నారదుడు నివ్వెరపోయాడు.

This was posted under category: కథలు