Archive for August, 2008
అలై పొంగెరా …మానసము…
Wednesday, August 27, 2008 9:31 13 Commentsఅలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
అసలు ఈ పాటని నేను పూర్తిగా వినడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలై పొంగెరా – మలైపొంగెరా అని వినగానే వేటూరి మరో రుబ్బురోలు పాట అని వదిలేసాను. అలాంటిది మాస్టారు ఈ పాటని వివరించినటపా చూసేసరికి సంభ్రమం కలిగింది. పాట వింటూ వింటూ జగణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంతలోనే నెత్తిమీద బాంబు పేలింది. పాటని వివరించమంటూ కొత్తపాళీగారి ఆజ్ఞ. అందరూ పాటని పూర్తిగా పరిశోధించినతరువాత వ్రాయడంలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే [...]
హిందూ తాత – సెక్యులర్ మనవడు – 2
Monday, August 25, 2008 0:30 26 Commentsమనవడు:తాతా! అసలు ఈ సతీ సహగమనం అంత దురాచారాన్ని హిందూమతం అసలు ఎలా ఒప్పుకొన్నాది? ఆదిశక్తి అంటావు – సతీదేవి తన తండ్రి దక్షుని యాగంలో తనను తాను ఆత్మాహుతి చేసుకొని స్త్రీలందరికీ బాట చూపిందంటారు కదా! మహాభారతంలో పాండురాజు భార్య మాద్రి సహగమనం చేసిందని ఉన్నాది కదా! అలా ఈ దురాచారం హిందూ సమాజంలో పాతుకుపోయింది కదా! ఇంత రాక్షసత్వమైన దురాచారం గురించి నీ సమాధానమేమిటి?
తాత:అబ్బీ! సహగమనం అంటే ఏమిటిరా? కలసి నడవమని కదా! భర్తతో [...]
హిందూ తాత – సెక్యులర్ మనవడు
Saturday, August 23, 2008 22:51 14 Commentsతాతా! నాకీ హిందూ మతం వద్దు. నేను ఈ మతాన్ని త్యజించెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇంత లోపభూయిష్టమైన, అసంబద్దమైన మతం ఈ ప్రపంచంలోనే లేదు.
అయినా నా బతుకేదో నేను బతుకుతున్నాను. నాకు దేముడిమీదే నమ్మకం లేదు. నాకు కావల్సినది ‘నేను’ సుఖంగా బతకడం ఎలా! అది ఈ మతం నాకు నేర్పుతున్నట్టు నాకు అనిపించటం లేదు.
అసలు నా స్నేహితులందరిలో ఎంత చులకనగా ఉందో తెలుసా నీకు. హిందువుని అని చెప్పుకోవటానికి ఎంత సిగ్గుగా ఉందో తెలుసా!
ఒక దేవుడా ! [...]
ఇంటిపేరు కస్తూరివారు …
Friday, August 15, 2008 20:48 No Commentsస్వాగతం – స్వాగతం ఓ సుందరమూర్తి,
అందుకో వందనం ఓ మంగళ దీప్తి,
ఎవరమ్మా నీవు – దేవతలా ఉన్నావు
చల్లని చిరునవ్వు చిందిస్తూ ఉన్నావు
చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తున్నావు
ఎవరమ్మా నీవు?
కైలాసకిరీటాన్ని కలిగున్న శిరసుదాన్ని,
హిందుసాగరాన్ని అందెలుగ ఉన్నదాన్ని,
గంగమ్మ అమృతాన్ని అందించుచున్నదాన్ని,
వేదాల దివ్యవాణి వినిపించే నాదాన్ని,
ఇంకెవరూ నాకు సాటిలేరు
పుణ్యభరతభూమి అన్నది నా పేరు
స్వాగతం స్వాగతం ప్రేతకళలమూర్తి,
ఏవిటీ వాలకం పీడకలల శాల్తీ,
ఎవరయ్యా నువ్వు దెయ్యంలా ఉన్నావు,
బక్కచిక్కివున్నావు, బిక్కచచ్చి ఉన్నావు,
దిక్కుమొక్కులేని కుక్కపిల్లలా ఉన్నావు
ఎవరయ్యా నువ్వు
నైరాశ్యపర్వతాన్ని మోస్తున్న వెన్నువాణ్ణి,
మూడు సముద్రాలై ఏడుస్తూన్నవాణ్ణి,
నీరులేని నదిలో వలవేయు బెస్తవాణ్ణి,
మస్తుగా [...]
నిజమెరుగని మనుగడ కధ – దిశనెరుగని గమనము కద…
Tuesday, August 12, 2008 2:37 3 Commentsభార్యను కిరసనాయిలు పోసి తగలపెట్టిన భర్త
- పురుషాధిక్య ప్రపంచం నశించాలి. అనాదిగా సాగుతున్న మగవాళ్ళ దురహంకారం చెల్లదు.
బిడ్డకు జన్మనిచ్చిన 9 వ క్లాసు అమ్మాయి.
- యువత పెడుదోవ పడుతోంది. పాశ్చాత్య సంస్కృతి మనని పూర్తిగా ఆక్రమించుకొంటోంది.
ఈ మధ్య వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని Headlines – వాటికి నా చుట్టుపక్కలవాళ్ళ Reactions వ్రాసాను. మరొక్కసారి పరికించి చూడండి.
ఇంటిపని నుంచి వంటపని దాకా చేదోడువాదోడుగా ఉంటూ జీవన భాగస్వామ్యానికి పరిపూర్ణార్ధంగా నిలచిన భర్తలెందరో ఉన్నారని మీకు తెలుసని నాకు తెలుసు.
కర్నాటక, పాశ్చాత్య సంగీతాల్ని [...]