Archive for the ‘కథలు’ Category

నేను సైతం…

Monday, April 13, 2009 9:49 7 Comments

స్వామీ! స్వామీ! అంటూ గురువుగారిని పిలిచాడు శిష్యుడు.
నెమ్మదిగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచిన గురువు శిష్యునివంక ఏమిటన్నట్టు చూసాడు.
మీరు ప్రపంచం బాగోగులగురించి అంతగా పట్టించుకుంటారు. కొంచెం శిష్యులగురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
ఏమి నాయనా! నీకేమి కష్టం వచ్చింది?
నేను ధరించిన ధోవతీ చూడండి గురువర్యా! పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. నాకొక కొత్త ధోవతీని ఇప్పిస్తే…
గురువు శిష్యుడి ధోవతీ వంక తేరిపార చూసాడు. నిజంగానే జీర్ణావస్థలో ఉందది.
సరే అంటూ… గురువు శిష్యునికి ఒక కొత్త ధోవతీ తెప్పించాడు. [...]

This was posted under category: కథలు

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కథ – 2

Tuesday, September 9, 2008 1:00 5 Comments

సినిమాల్లోలాగ చెట్లు ఊగడం, కెరటాలు పెద్దగా రావడం, పక్షుల అరుపులూ అలా ఏదో ప్రళయం వచ్చినట్టుగా అయ్యిందని అనేసుకున్నారా? ఏమీ లేదు. నిజంగా ప్రళయం చెప్పి రాదు.

ధన్యోస్మి అంటూ ఆమని బ్రహ్మకూ, లక్ష్మికీ, సరస్వతికీ నమస్కరించి వెనుతిరగబోతూ ఒక్కసారి నారదుడి వంక చూసింది. ఆశ్చర్యం. నారదుడి ఫాలబాగంలో – చమత్కారి, పరమభక్తుడు, కొంటెవాడు, వాక్చాతుర్యం కలవాడు అని కనిపించింది. నుదుటి మీద తెర ప్రత్యక్షం కాగానే నారదుడు నివ్వెరపోయాడు.

This was posted under category: కథలు

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కథ – 1

Sunday, September 7, 2008 13:43 6 Comments

“నారాయణా! స్వామీ! నారాయణస్వామీ!” అంటూ నారదుడు జయ విజయులను దాటుకుంటూ వైకుంఠంలో అడుగుపెట్టాడు. యధాప్రకారం స్వామి తలక్రింద చెయ్యిపెట్టుకుని శ్రీకి చరణాలందించి నిద్రపోతున్నాడు.మళ్ళీ “నారాయణా” అని గట్టిగా పిలవబోయాడు నారదుడు. అమ్మ ఆపి అమ్మాయిని పట్టుకుమరీ వచ్చావేమయ్యా అని అడిగింది.
” అసలు పని నీతోనేనమ్మా! ఆయన లేచుంటే ఏవో పుల్లలు పెడతాడని పడుక్కున్నాడా లేదా అని టెస్ట్ చేస్తున్నా అంతే” అన్నాడు నారదుడు.
“ఎవరీ అమ్మాయి? సరాసరి వైకుంఠానికే పట్టుకువచ్చేసావు. ఏమన్నా తొందర పడ్డావా? హైదరాబాదులో రిజిస్టరు మేరేజి [...]

This was posted under category: కథలు