Archive for the ‘కవితలు’ Category
ప్రయత్నం
Friday, October 10, 2008 14:35 7 Commentsఇంకేమి చెయ్యాలో నాకు తెలియటం లేదు.
ఈ రాయికి సంగీతం నేర్పించాలంటే ఇంకేమి చెయ్యాలో..
ముందుగా నీలపు నింగిని చూపించా – ఆ మౌనగీతాన్ని వినమని
గాలి వేగాన్ని – అందులోని భావగీతాన్నీ వినిపించా
వర్షమేఘాల హర్షరాగాన్ని వినిపించా – వాద్యమయ్యే ఆ ఘోషనీ వినిపించా
నేలను తాకిన నీరు జలపాతంగా ఎదిగే హోరుని వినిపించా
అల్లరి జలపాత కన్నియ పారే ప్రౌఢనదిగా మారిన మంద్రాన్ని వినిపించా
నది మందగమనంతో పుడమి తల్లిని కలసి చెప్పిన ఊసులను వినిపించా
పైరుపైటేసి పుడమితల్లి పాడిన సంక్రాంతి పదగతులను వినిపించా
నది తన [...]
వినయం
Friday, September 5, 2008 17:46 13 Commentsఇసుకలో పొర్లుతున్న ఓ చిన్నిఉడత
పర్వతాల్ని కదిలిస్తున్న వానరసేనను చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
రామహస్తం వెన్ను నిమిరింది.
మేఘం నుంచి రాలిపడుతున్న ఓ వర్షపు చుక్క
అగాధమైన సముద్రాన్ని చూసి సిగ్గుపడింది
నా అస్తిత్వానికి అర్ధమేమిటని
నీ విలువ నాకు తెలుసునంటూ
ముత్యపు చిప్ప తనలో ఇముడ్చుకుంది