Archive for the ‘తాత - మనవడు’ Category
చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం
Friday, April 3, 2009 14:59 8 Commentsఎన్నాళ్ళో గడిచినా, ఎన్నేళ్ళో ముగిసినా ఏ ఏటికాఏడే కళ్యాణమా!
పిల్లను గెలిచావనా, విల్లును విరిచావనా ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా!
కాపురమంతా కారడవిగా, జీవితమంతా కష్టాలుగా..
చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం,
పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారకమంత్రం.
రామయ్యా! వివాహ దిన శుభాకాంక్షలు. అసలు నువ్వున్నావా! లేవా? ఏమిటో, చుట్టూ నువ్వు తిరుగాడిన నేల అంటారు తాతగారు. అమ్మ స్నానం చేసిన సెలయేరు అదిగో నీళ్ళు జల్లుకో అంటారు. నాకేమో నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతీ ఊరిలోనూ నీ [...]
హిందూ తాత – సెక్యులర్ మనవడు – 4
Sunday, November 16, 2008 15:56 11 Commentsమనవడు: తాతా, ఈ భీష్ముడి సంగతి కొంచెం తేలుస్తావా?
తాత: శత్రువులకు మరణ రహస్యం చెప్పాడని, అది దేశ ద్రోహం అని భీష్ముడి మీద ఒక అభియోగం. దీని పూర్వాపరాలు కొంచెం చూద్దాం.
అప్పటికి 9 రోజుల యుద్ధం ముగిసింది. ఇరుపక్షాలవైపూ విపరీతమైన సైన్య నష్టం జరిగింది. పాండవుల్లో ఒక నిరాశ అలముకుంది. భీష్ముడు ఆయుధం ధరించి ఉండగా విజయం చేజిక్కే మార్గం అసంభవం అని వాళ్ళకు స్పష్టం అయ్యింది.
ఉన్నాడుగా నల్లనయ్య. వెళ్ళి మీ తాతకు అతనిచ్చిన ఆశీర్వాదం [...]
హిందూ తాత – సెక్యులర్ మనవడు – 3
Friday, September 12, 2008 20:51 7 Comments“తాతా! ఇన్ని మతాలేంటి? ఇన్ని విధానాలేమిటి? నిజంగా దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలేమిటి? ఇవన్నీ ఒక తానులో ముక్కలే అనిపిస్తాయి. అసలు మతాన్నే నిషేధిస్తే మంచిదనిపిస్తుంది. వీటన్నిటిలో ఉన్న గందరగోళం కంటా హేతువాదం/తర్కం మేలనిపిస్తుంది. అది కనీసం ఈ తానులో ముక్క కాదు కదా! “
హిందూ తాత – సెక్యులర్ మనవడు – 2
Monday, August 25, 2008 0:30 26 Commentsమనవడు:తాతా! అసలు ఈ సతీ సహగమనం అంత దురాచారాన్ని హిందూమతం అసలు ఎలా ఒప్పుకొన్నాది? ఆదిశక్తి అంటావు – సతీదేవి తన తండ్రి దక్షుని యాగంలో తనను తాను ఆత్మాహుతి చేసుకొని స్త్రీలందరికీ బాట చూపిందంటారు కదా! మహాభారతంలో పాండురాజు భార్య మాద్రి సహగమనం చేసిందని ఉన్నాది కదా! అలా ఈ దురాచారం హిందూ సమాజంలో పాతుకుపోయింది కదా! ఇంత రాక్షసత్వమైన దురాచారం గురించి నీ సమాధానమేమిటి?
తాత:అబ్బీ! సహగమనం అంటే ఏమిటిరా? కలసి నడవమని కదా! భర్తతో [...]
హిందూ తాత – సెక్యులర్ మనవడు
Saturday, August 23, 2008 22:51 14 Commentsతాతా! నాకీ హిందూ మతం వద్దు. నేను ఈ మతాన్ని త్యజించెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇంత లోపభూయిష్టమైన, అసంబద్దమైన మతం ఈ ప్రపంచంలోనే లేదు.
అయినా నా బతుకేదో నేను బతుకుతున్నాను. నాకు దేముడిమీదే నమ్మకం లేదు. నాకు కావల్సినది ‘నేను’ సుఖంగా బతకడం ఎలా! అది ఈ మతం నాకు నేర్పుతున్నట్టు నాకు అనిపించటం లేదు.
అసలు నా స్నేహితులందరిలో ఎంత చులకనగా ఉందో తెలుసా నీకు. హిందువుని అని చెప్పుకోవటానికి ఎంత సిగ్గుగా ఉందో తెలుసా!
ఒక దేవుడా ! [...]