Archive for the ‘అవీ ఇవీ’ Category

బ్లాగు విలాప కావ్యం…

Saturday, January 24, 2009 23:26 16 Comments

నే నొక బ్లాగుమొక్క కడ నిల్చి చివాలున లింకునొక్కి డె
ల్లన్నంతలోన, టపా లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది బ్లాగువిలాప కావ్యమై.
జల్లెడ యొడిలోన కూడలి తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష వ్యాఖ్యల కొరకు!
హృదయమే లేని నీ టపా లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమృద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
బ్లాగర్లకై పూయదే నాల్గు చిన్ని టపాలు?
ఆయువు గల్గు [...]

This was posted under category: అవీ ఇవీ

స్వరరాగగంగాప్రవాహమే…

Sunday, December 14, 2008 0:21 12 Comments

ఉత్సుకత – ఉత్కంఠ – ఉద్వేగం. అన్నీ కలగలిపిన అదో విచిత్రమైన అనుభూతి. కొన్ని క్షణాలలో నేనింక ఆనందపు అవధులను దాటి ఆకాసపు ఆ కొస అందుకోబోతున్నానని. కాలం గడవటం లేదు. ఎలా ఉంటుంది ఆ అనుభూతి. నిజంగా నన్ను నేను కోల్పోతానా – అనాది జీవన వేదంతో కంపిస్తానా ఎద కనుమలలో విరించి విపంచి గానం వినిపిస్తుందా – ఆలోచనలు ఎడతెగటం లేదు.
నాకు కర్నాటకశాస్త్రీయ సంగీతమంటేనే పరిచయం లేదు. అప్పుడప్పుడూ విన్న బాలమురళి పంచరత్నాలూ, రామదాసు [...]

This was posted under category: అవీ ఇవీ

చీమ నేర్పిన పాఠం

Thursday, November 13, 2008 8:47 4 Comments

నిన్న సాయంత్రం చెప్పుల్లేకుండా గడ్డిలో నడుస్తుంటే కసక్కుమని రాయి గుచ్చుకుంది. ఈ రాయి చేసిన పాపానికి నిష్కృతి లేదు. దీనికి రౌరవాది నరకాలు తప్పవని అనుకుంటూ కిందకి చూసాను. అదే రాయిపై ఒక చీమ హాయిగా పాకురుకుంటూ ఆనందముగా వెళ్ళిపోతోంది. ‘ ఆహా! ఏమి ఈ చీమ చేసిన పుణ్యము – నేను చేసిన పాపమేమి’ అని అనుకుంటూ ఉండగా చేదుగా ఉన్నా ఒక నిజం స్ఫురించింది. నాకు నొప్పి కలిగించింది నా బరువేగాని రాయి [...]

This was posted under category: అవీ ఇవీ

ప్రేమంటే ఏమిటంటే … ప్రేమించగానె నాకు తెలిసె…2

Friday, September 26, 2008 22:16 16 Comments

కిందటి టపాలో ప్రేమ, దైవం, సత్యం అన్నవి అదే వరుసలో దుర్వినియోగం చెయ్యబడ్డ పదాలుగా చెప్పాను కదా! ముందుగా అవి అదే వరుసలో ఎందుకు దుర్వినియోగం చెయ్యబడ్డాయి అన్నది చూద్దాం.
సత్యం అతి తక్కువగా దుర్వినియోగపరచబడడానికి కారణం ఏమిటంటే దాని అనుభూతి పొందడం చాలా కష్టం. నిజంగా సత్యాన్ని కనుగొన్నవారిని వదిలేయండి. సత్యం తను కనిపించేముందు ఆ వ్యక్తినోటిని కుట్టేసి ఆ తరువాత కనిపిస్తుందిట. కాబట్టి మీకు నిజంగా ఎవరైనా సత్యాన్ని కనుగొన్నామని చెపితే వారు అబద్ధం చెబుతున్నట్టే. [...]

This was posted under category: అవీ ఇవీ Tags: , ,

అగ్ని ప్రవేశం

Saturday, September 20, 2008 11:50 29 Comments

పల్లకీ సాగుతోంది. ఉద్విగ్నతతో, ఆనందంతో, అయోమయంలో, నిజమా కలా అని తెలియని పరిస్థితిలో డోలాయమానంగా ఉంది సీత. కొంచెంసేపటి క్రితం త్రిజట “అమ్మా! రావణుడు మరణించాడు. నీ కష్టాలు గట్టెక్కాయమ్మా! శ్రీరామచంద్రుడు నిన్ను తక్షణమే చూడాలంటున్నారు. పదమ్మా! ” అన్నది. అలంకరించుకొమ్మంటూ చీనీ, చీనాంబరాలు, నగలూ అన్నిటితో స్త్రీలు నిలబడి ఉన్నారు. నా రాముని నేను చేరుకోవాలి – నాకివన్నీ ఎందుకు అంటూ సీత వడివడిగా బయలుదేరింది. పల్లకిని అధిరోహించమ్మా అని త్రిజట అంటూ సీతను పల్లకీ [...]

This was posted under category: అవీ ఇవీ Tags: , , , ,