Archive for the ‘సినీ గీతాలు’ Category

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?

Wednesday, October 8, 2008 0:25 9 Comments

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?

చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం [...]

This was posted under category: సినీ గీతాలు

ఆదిభిక్షువు వాడినేది కోరేది

Thursday, October 2, 2008 0:53 22 Comments

ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది

సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన మొదటి సినిమాలోదీ పాట. బాగు ప్రాచుర్యం పొందిన పాట. పండితులసంగతి తెలియదు గానీ, నాబోటి పామరులకు బాగా నచ్చిన పాట. నిందాస్తుతి శిల్పంలో వ్రాయబడ్డ పాట. నిందాస్తుతి అన్నది ఎప్పటినుంచో ఉన్న సాహితీప్రక్రియే. సినిమాపాటల్లో కూడా నిందాస్తుతితో ఉన్న కొన్ని పాటలున్నట్టే గుర్తు. ఇంతకీ సినిమాలో ఈ పాటలో మూడు చరణాలుంటాయి. కానీ, అసలు ఆయన వ్రాసినదానిలో ఇంకా చాలా చరణాలున్నాయి. అన్నిటినీ మీముందుంచాలని ఈ ప్రయత్నం.
తేనెలొలికేటి పూలబాలలకు [...]

This was posted under category: సినీ గీతాలు Tags: , , , , , ,

అలై పొంగెరా …మానసము…

Wednesday, August 27, 2008 9:31 13 Comments

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా

అసలు ఈ పాటని నేను పూర్తిగా వినడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలై పొంగెరా – మలైపొంగెరా అని వినగానే వేటూరి మరో రుబ్బురోలు పాట అని వదిలేసాను. అలాంటిది మాస్టారు ఈ పాటని వివరించినటపా చూసేసరికి సంభ్రమం కలిగింది. పాట వింటూ వింటూ జగణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంతలోనే నెత్తిమీద బాంబు పేలింది. పాటని వివరించమంటూ కొత్తపాళీగారి ఆజ్ఞ. అందరూ పాటని పూర్తిగా పరిశోధించినతరువాత వ్రాయడంలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే [...]

This was posted under category: సినీ గీతాలు Tags: , , , , ,

జగమంత కుటుంబం నాది…

Saturday, August 9, 2008 18:05 4 Comments

జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవనం నాది
సంసారసాగరం నాదే – సన్యాసం, శూన్యం నావే
పాట మొదటి లైను వినగానే ఇది ఏదో “వసుధైక కుటుంబకమ్” కి సంబంధించిన పాట అనిపిస్తుంది. అయితే అలాంటి ఆలోచన మనకు పాటలోని సంపూర్ణార్ధాన్ని అందివ్వదు. రవి, కవి మార్గాన్ని చూపించేవాళ్ళు. వారిద్దరిమధ్య సామ్యాన్ని చూపిస్తూ వ్రాసిన కవితలు చాలా ఉన్నాయి. కాకపోతే రవి గాని, కవి గాని, ప్రధమపురుషలో తమ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, వారి మధ్య సామ్యాన్ని పాఠకులు తమంతటతాము [...]

This was posted under category: సినీ గీతాలు

అందెల రవమిది పదములదా…

Wednesday, August 6, 2008 8:50 6 Comments

‘నాదమే జగన్నాథము’ అన్నది భారతీయ సనాతన సాంప్రదాయ విశ్వాసము. ఈ విశ్వమంతా ఓంకారం నుండే జనించిందని విజ్ఞుల అభిప్రాయము. అందువలన ఈ విశ్వపు ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందాన్ని అందుకోవాలంటే మన మానసవీణ ప్రణవనాదపు శృతిలో కంపించాలి. (Resonate కావాలి). తలచిన కార్యాన్ని మనస్సు, వాక్కు, కర్మ అనే త్రికరణశుద్ధితో, పంచేంద్రియాలనూ కేంద్రీకరించి కార్యాన్ని సాధించి – మాటలకందని ఆ ఆనందపు అనుభూతిని అందుకున్న సాధకుల సచ్చరిత్రలు మన ఇతిహాసాలనిండా కోకొల్లలు. సీతాదేవిని వెతకి వెతకి పట్టుకున్న [...]

This was posted under category: సినీ గీతాలు