Archive for the ‘ప్రారంభం’ Category

నాకూ ఛందపుటీగ కుట్టింది.

Friday, October 24, 2008 19:46 6 Comments

మొన్న భువనవిజయం చూసానా – అప్పటినుంచి ఎలాగోఅలాగ, ఏదో ఒక విషయం మీద ఛందస్సుతో పద్యం రాసేయాలని. ఆశ ఆకాశమంత. శక్తి అణువంత. కానీ ఊహతో పోరాడి తర్కం/నిజం ఎప్పుడు గెలిచింది కనుక? ఎలాగోలా పద్యాలు వ్రాసేద్దామనే నిశ్చయించాను. అనుకుంటే సరిపోతుందా? మనకసలు ఏవీ రాదాయె. చిన్నప్పుడు చదువుకున్న ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు’ లాంటివి తక్క – గట్టిగా లెక్కెడితే వందపద్యాలు కూడా రావు. యమాతారాజభానస అని ఏదో సినిమాలో కమల్ హాసన్ అనడంతో గణాలని గుర్తుపెట్టుకునీ – [...]

This was posted under category: ప్రారంభం

అంతం కాదిది ఆరంభం

Friday, August 1, 2008 23:43 4 Comments

మేమున్నామంటూ వెన్ను తట్టి వెంట నిలిచిన బ్లాగు వీరులందరికీ లాల్ సలామ్.
ఆనందమూ, విజ్ఞానమూ పంచుకోవడం – పెంచుకోవడానికే అన్నది నా విశ్వాసం. ఆకు విచ్చిన అరవిందాల్నీ, లేత పచ్చని చిగురందాల్నీ, నయగారా జలపాతాన్నీ, కన్యాకుమారి సూర్యోదయాల్నీ చూసేసి ఆ ఆనందాన్నంతా గుండెల్లో దాచేసుకొని ఉండడం అసాధ్యం. ఆ ఆనందాన్ని వంద మందితో వందసార్లు చెప్పి – ప్రతీ సారీ ఆ అనుభూతిని మనం అనుభవించటమే కాక – పక్కవాళ్ళు కూడా అదే అనుభూతిని పొందేదాకా విడిచిపెట్టక – [...]

This was posted under category: ప్రారంభం

ప్రారంభానికిది ప్రారంభం

Friday, August 1, 2008 10:01 13 Comments

కూడలిలో 198 బ్లాగులు చూసిననాటినుంచి అనుకుంటున్నాను – నేను సైతం బ్లాగు వీణకు తంత్రినౌతాను అని. కానీ ధైర్యం చాల లేదు. ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎందుకు చెప్పాలి?
ఏమి చెప్పాలి – నేనేమీ మన మహాకవుల కవితా విత్తనాలతో సాహితీ వ్యవసాయం చేస్తున్న ‘సాలభంజికల′ నాగరాజు గారిని కాదు. బోలెడు Technical విషయాలు చెప్పటానికి మన వీవెన్ గారిలా సాంకేతిక ధురంధరుడిని కాదు. ఎడంచేతి వాటంగా నాలుగు జోకులు, ఎనిమిది పారడీలు రాసి పారేయటానికి [...]

This was posted under category: ప్రారంభం